పవన్‌ కళ్యాణ్‌కు నిలకడ, నిబద్ధత లేవు

బిజెపి పాచిపోయిన లడ్డులూ ఇచ్చిందన్న ఆయన ఇప్పుడు పొత్తుఎందుకు పెట్టుకున్నారో చెప్పాలి

Vellampalli Srinivas
Vellampalli Srinivas

విజయవాడ: జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు నిలకడ, నిబద్ధత లేవని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ విమర్శించారు. బిజెపితో పొత్తు అందుకు నిదర్శమన్నారు. డబ్బులు తీసుకొని రాజకీయాలు చేసే పవన్‌ లాంటి నాయకుడిని తనెక్కడా చూడలేదని చెప్పారు. శుక్రవారం వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ..గతంలో బిజెపి పాచిపోయిన లడ్డులూ ఇచ్చిందన్న పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడేందుకు పొత్తుపెట్టుకున్నాడో సమధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. పవన్‌ బిజెపిని ప్రత్యేక హోదా కోసం ఎందుకు నిలదీయడం లేదని సూటిగా ప్రశ్నించారు. పవన్‌ది కుటుంబ సభ్యులను కూడా కలుపుకోలేని మనస్తత్వం అని విమర్శించారు. పవన్‌ కళ్యాణ్‌ త్వరలోనే జనసేనను బిజెపిలో విలీనం చేస్తారని ఆరోపించారు. ఇటువంటి వ్యక్తి అని ముందే తెలిసి ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పారని గుర్తుచేశారు. పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయిన పవన్‌ కళ్యాణ్‌ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/