‘పవన్ కల్యాణ్ ఓ దద్దమ్మ..” అంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై వైస్సార్సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏ కులమో చెప్పుకోలేని దద్దమ్మ పవన్ కల్యాణ్ అని విమర్శించారు. అప్పుడేమో కాపు అన్నాడని, నిన్న ఏమో బీసీ అంటున్నాడని, చిరంజీవి పార్టీ పెట్టి ఓటమి చెందిన తర్వాత రోజే అన్నను వదిలేసిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని ఘాటుగా విమర్శలు చేసారు వెల్లంపల్లి.

ప్యాకేజీకి అమ్ముడుబోయే పార్టీ జనసేన అని, చంద్రబాబుకు ఊడిగం చేసే పార్టీ అని, జనసేన పనికిమాలిన పార్టీ అని, టీడీపీ అధినేత చంద్రబాబుకు భజన చేసే పార్టీ అని వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. జగన్ సవాల్ చేసిన విధంగా రాష్ట్రంలో సింగిల్‌గా 175 స్దానాల్లో పోటీ చేసే దమ్ము టీడీపీ లేదా జనసేనకు ఉందా..? అంటూ ప్రశ్నించారు. జగన్ అనే సింహాం సింగిల్‌గా వస్తుందని, 2024 ఎన్నికల్లో 175 సీట్లు వైసీపీ గెలుస్తుందని వెల్లంపల్లి జోస్యం చెప్పారు.