హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం..

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు లో ఒక్కసారిగా మంటలు చెలరేగి..రెప్ప పాటులోనే కారు మొత్తం దగ్ధం అయ్యింది. కారు లో ప్రయాణిస్తున్న వ్యక్తి ఆ మంటల్లోనే సజీవదహనం అయ్యాడు. శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

హోండా అమేజ్ AP27 C0206గా కారుగా పోలీసులు గుర్తించారు. కారు నంబర్ ఆధారంగా మృతి చెందిన వ్యక్తి వివరాలు ఆరా తీస్తున్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ వద్ద ఓవర్ స్పీడ్‌గా డ్రైవ్ చేసినట్లు చలాన్ రావడంతో ఆ దిశగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.