అండర్ వాటర్‌లో రిస్కీ షాట్ చేసిన తేజ సజ్జ

Teja Sajja did a risky shot underwater

Community-verified icon


తేజ సజ్జ..బాల నటుడిగా యావత్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ కుర్రాడు..ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. జాంబీరెడ్డి, ఇష్క్, అద్భుతం వంటి సినిమాల్లో హీరోగా నటించిన తేజ..ప్రస్తుతం హనుమాన్ మూవీ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జాంబీ రెడ్డి చిత్రానికి డైరెక్ట్ చేసిన ప్రశాంత్ వర్మ..హనుమాన్ మూవీ ని తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియన్ సినిమాగా రూపొందుతున్న ‘హనుమాన్’ మూవీ ఇప్పటికే టీజర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

తాజాగా ఈ సినిమాను సంబదించిన అండర్ వాటర్ సీక్వెన్స్‌ను భారీ స్థాయిలో చిత్రీకరించింది. ఈ సన్నివేశం ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. గతంలో దర్శకుడు రాజమౌళి ఇలాంటి అండర్ వాటర్ సీక్వెన్స్‌ తీయగా.. రామ్ చరణ్‌ #RC15 కోసం డైరెక్టర్ శంకర్ సైతం ఇలాంటి సీక్వెన్స్ షూట్ చేశాడని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ ఈ సీక్వెన్స్‌ను చాలా బాగా కాన్సెప్ట్ చేశాడని, అవుట్‌పుట్ బ్రహ్మాండంగా వచ్చిందని మేకర్స్ చెపుతున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుండగా.. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.