వీరసింహరెడ్డి ఎలా ఉందంటే..

నందమూరి బాలకృష్ణ – శృతి హాసన్ జంటగా క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన వీరసింహ రెడ్డి మూవీ భారీ అంచనాల నడుమ ఈరోజు (జనవరి 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య బాబు ను ఎలా చూడాలనుకుంటున్నారో డైరెక్టర్ గోపి అలాగే చూపించి సక్సెస్ అయ్యాడు. భారీ డైలాగ్స్ , భారీ యాక్షన్ ఇలా అన్ని భారీగా చూపించాడు.కానీ కథలోనే దమ్ము లేకుండా అయిపోయింది.

సినిమాలో బాలయ్యని వీరలెవల్లో చూపించాలనే ప్రయత్నంలో కథని గాడితప్పించాడు డైరెక్టర్. కేవలం ఫైట్‌లు.. యాక్షన్.. ఎలివేషన్స్‌పైనే ఫోకస్ పెట్టాడు దర్శకుడు గోపీచంద్. ఫ్యాక్షన్ నేపథ్యంలో సిస్టర్ సెంటిమెంట్‌ని సరిగా ఎలివేట్ చేయలేకపోయారు. బాలయ్యని ఒకప్పటి సమరసింహారెడ్డి, నరసింహనాయుడు గెటప్‌లో చూపించినా.. ఆ సినిమాల స్థాయి కథని అయితే అందించలేకపోయాడు. బాలయ్యకి కత్తి ఇచ్చి నరికిస్తే ప్రేక్షకులే చూసుకుంటారని అనుకున్నారో ఏమో కానీ.. అవసరం ఉన్న లేకపోయినా ఫైట్లు పెట్టి.. రక్తపాతం సృష్టించారు. ఇక డైలాగ్స్ గట్టిగానే ఉన్నప్పటికీ , కొన్నిచోట్ల మాత్రం అవసరం లేని డైలాగ్స్ వాడాడు. అంతే కాదు అధికార పార్టీ ఫై కొన్ని పంచ్ డైలాగ్స్ వేసినట్లు సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అనిపిస్తాయి.

ఓ మినిస్టర్‌ని ఉద్దేశించి చెప్పే సందర్భంలో.. ‘వాళ్లు ప్రజలు కూర్చోబెట్టిన వెధవలు.. గౌరవించడం మన బాధ్యత’ అని డైలాగ్ కొడతాడు బాలయ్య. ఇలా ప్రభుత్వాన్ని గిల్లే డైలాగ్‌లు సినిమాలో చాలానే ఉన్నాయి. ముఖ్యంగా అభివృద్ధికి సంబంధించి చెప్పిన డైలాగ్. ‘‘ఏది అభివృద్ధి మిస్టర్ హోమ్ మినిస్టర్? ప్రగతి సాధించడం అభివృద్ధి.. ప్రజల్ని వేధించడం కాదు., జీతాలు ఇవ్వడం అభివృద్ధి.. బిచ్చమేయడం కాదు., పని చేయడం అభివృద్ధి.. పనులు ఆపడం కాదు., నిర్మించడం అభివృద్ధి.. కూల్చడం కాదు., పరిశ్రమలను తీసుకుని రావడం అభివృద్ధి.. ఉన్న పరిశ్రమలను మూయడం కాదు. బుద్ధి తెచ్చుకో అభివృద్ధికి అర్థం తెలుసుకో.. వాడు దోచుకోవడానికి వచ్చాడు.. నాట్ అలౌడ్..’’ అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ అధిక పార్టీ ఫై వేసినట్లు అనిపిస్తుంది.

ఓవరాల్ గా బాలయ్య నుండి ఓ యాక్షన్ మూవీ ని చూడొచ్చు. అఖండ రేంజ్ లో లేకపోయినా..వన్ టైం చూడొచ్చు అనే మాదిరిగా ఉంది.