‘మా’ ఎన్నికల నేపథ్యంలో నిర్మాత‌ల మండ‌లి సంచలన ప్రకటన

‘మా’ ఎన్నికలు అక్టోబర్ 10 న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిర్మాత మండలి ఓ ప్రకటన చేసింది. ‘మా’ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ఈ నెల 10వ‌ తేదీన ఓటు వేశాకే షూటింగ్‌లకు హాజరు కావాలని పిలుపునిచ్చింది. ఎన్నిక‌ల నేప‌థ్యంలో అందులో పాల్గొన‌కుండా సినీన‌టులు షూటింగుల‌కు వెళ్లే అవ‌కాశం ఉండ‌డంతో ఎన్నికల అధికారి నిర్మాత‌ల మండ‌లికి అభ్యర్థన చేయ‌డంతో ఆ మండ‌లి ఈ ప్ర‌కట‌న చేసింది. ఆదివారం ఉదయం హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో మా ఎన్నికలు జరగనున్నాయి.

ఇక ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతుండడం తో విష్ణు , ప్రకాష్ రాజ్ ల ప్యానల్ సభ్యులు తమ ప్రచారాన్ని స్పీడ్ పెంచారు. అలాగే ఒకరిపై ఒకరు విమర్శలు సైతం పెంచుకుంటున్నారు. విమర్శలు , వార్నింగ్ లు , పోలీస్ స్టేషన్ లో కేసుల వరకు వెళ్ళింది. మరి ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. ఇదిలా ఉంటె ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి చేసిన ట్వీట్ ఇప్పుడు ఇండస్ట్రీ లో చర్చ గా మారింది.

మా ఎన్నికల సందర్బంగా జరుగుతున్న ఈ థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ను చూస్తుంటే నాక్కూడా మా ఎన్నికలపై ఆసక్తి కలుగుతుంది. రెండు మూడు సినిమాల్లో నటించి మా కార్డును తీసుకొని మా ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేయాలని ఉంది అంటూ ట్వీట్ చేశాడు. పని పాట లేని వారు.. ఒకటి రెండు సినిమాల్లో నటించి ఖాళీగా ఉన్న వారు ప్రస్తుతం మా ఎన్నికల బరిలో హడావిడి చేస్తున్నారు అనేది చాలా మంది కామెంట్స్. ఇప్పుడు దర్శకుడు అజయ్ భూపతి వ్యాఖ్యలు చూస్తున్నా అలాగే అనిపిస్తున్నాయి అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.