తాడిపత్రి లో టీడీపీ కి భారీ షాక్

జేసి బ్రదర్స్ కు భారీ షాక్ తగిలింది. టీడీపీ కీలక నేత వైస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు ఓటర్లను దగ్గర చేసుకొనేపనిలో పడ్డాయి. నిత్యం పలు యాత్రలు , సభలు , సమావేశాలతో నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని టీడీపీ గట్టి ప్రయత్నాలే చేస్తుంది. జనసేన తో పొత్తు పెట్టుకోనైనా సరే వైస్సార్సీపీ ని గద్దె దించాలని చూస్తుంది. అంతే కాకుండా ఇతర నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇదిలా ఉండగానే టీడీపీ కి భారీ షాక్ తగిలింది.

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని నరసాపురంలో జేసీ బ్రదర్స్‌ ప్రధాన అనుచరుడు రామాంజులరెడ్డితో పాటూ వర్గీయులు 160 కుటుంబాలు వైస్సార్సీపీ పార్టీ కండువా కప్పుకున్నాయి. యాడికి మండలం రాయలచెరువుకు చెందిన రమణారెడ్డి ఆధ్వర్యంలో.. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జేసీ ప్రధాన అనుచరుడు, టీడీపీకి బలమైన కేడర్‌ ఉన్న చోట వైస్సార్సీపీ లోకి చేరికలు హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీ కోసం కష్టపడి పనిచేసినా గుర్తింపు లభించకపోవడం, వర్గ కక్షలు పెంచి పోషించే జేసీ సోదరుల వైఖరి నచ్చకపోవడంతో 160 కుటుంబాల వారు పార్టీ వీడారన్నారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి. టీడీపీ నుంచి వైస్సార్సీపీ లోకి చేరిన వారందరికీ ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.