ఓటర్ల కాళ్లు మొక్కుతూ ఓటు వేయాలని వేడుకున్న బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి

ఎన్నికలు వచ్చాయంటే చాలు రాజకీయ నేతల కష్టాలు అన్ని ఇన్ని కావు.. గెలిస్తే మళ్లీ ఓటర్ మొహం చూడని నేతలు..ఎన్నికలు సమయంలో మాత్రం అష్టకష్టాలు పడుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటారు. ఓటర్లను అడిగిందల్లా చేస్తూ..వారిని బంగారుబాతుల చూసుకుంటారు. తాజాగా ఓటర్ల కాళ్లు మొక్కుతూ ఓటు వేయాలని BSP అభ్యర్థి వట్టే జానయ్య వేడుకున్నాడు.

సూర్యాపేట నియోజకవర్గంలో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఓటర్ల కాళ్లు మొక్కుతూ.. ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను వేడుకున్నారు. విభజన వాదం బీఆర్ఎస్ పార్టీది అయితే.. బహుజనవాదం బీఎస్పీ పార్టీదని హితవు పలికారు. సూర్యాపేటలో గులాబీ జెండను మట్టిలో కలిపి.. బహుజన జెండను ఎగురవేసే రోజులు దగ్గరపడ్డాయన్నారు.