పూరి హెచ్చరిక బండ్ల గణేష్ పైనేనా..?

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పర్సనల్ విషయాలపై గత కొద్దీ రోజులుగా మీడియా లో పలు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలు చూసి చాలామంది నిజమే కావొచ్చు అని మాట్లాడుకుంటున్నారు. ఈ తరుణంలో పూరి కొడుడు ఆకాష్ నటించిన ‘చోర్​ బజార్’​ ప్రీరిలీజ్​ ఈవెంట్ లో నిర్మాత బండ్ల గణేష్ పూరి ఫై చేసిన కామెంట్స్ మరింత వైరల్ గా మారాయి. కొడుకును పూరి పట్టించుకోవడం , అయినా అతడు పెద్ద స్టార్ అవుతాడని గణేష్ చెప్పుకొచ్చాడు. అంతే కాదు పూరి తన దగ్గర లేని సమయంలోనే మా వదిన లావణ్య అతడి వెంట ఉంది. అన్నీ వచ్చాక కొన్ని ర్యాంపులు, వ్యాంపులు ఆయన వద్దకు వచ్చి చేరాయి. బయటవాళ్లను స్టార్​లను చేస్తూ.. కన్న కొడుకు ఫంక్షన్​ జరిగేటప్పుడు ముంబయిలో ఉండటం సరికాదు. తలకొరివి పెట్టేది కొడుకే. మనం ఏమి చేసినా కుటుంబం కోసమే. ఆ తర్వాతే ఎవరైనా అంటూ పలు వ్యాఖ్యలు పూరి ఫై గణేష్ చేసాడు. గణేష్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఈ క్రమంలో పూరి ఓ పాడ్​కాస్ట్​ విడుదల చేసాడు. “గుర్తు పెట్టుకోండి మన నాలుక కదులుతున్నంత సేపు మనం ఏమీ నేర్చుకోలేం. అందుకే లైఫ్​లో ఎక్కువ సమయం పాటు శ్రోతలుగా ఉంటే మంచిది. మీ కుటుంబసభ్యులు, దగ్గరి బంధుమిత్రులు, సహోద్యోగులు, ఆఖరికి కట్టుకున్న భార్య దగ్గర కూడా ఆచితూచి మాట్లాడండి. చీప్​గా వాగొద్దు. చీప్​గా ప్రవర్తించొద్దు. మన వాగుడు మన కెరీర్​ను, క్రెడిబిలిటీని నిర్ణయిస్తుంది. మీకు సుమతీ శతకం గుర్తుండే ఉంటుంది. ‘నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’ అని. తప్పు మాట్లాడటం కంటే నాలుక కొరికేసుకోవడం చాలా మంచింది. చివరగా ఓ మాట.. మీ జీవితం, చావు.. నోరు మీదే ఆధారపడి ఉంటాయి.” అని అందులో చెప్పుకొచ్చాడు. ఈ మాటలు విన్న అభిమానులు , నెటిజన్లు ఈ కామెంట్స్ ఖచ్చితంగా బండ్ల గణేష్ పైనే అని , ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గణేష్ చేసిన కామెంట్స్ కు పూరి ఇలా కౌంటర్ ఇచ్చాడని మాట్లాడుకుంటున్నారు. మొత్తం మీద మరోసారి పూరి అంశం చర్చ గా మారింది.