కస్టడీ టీజర్ రిలీజ్

నాగ చైతన్య – కృతి శెట్టి జంటగా వెంకట్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ కస్టడీ. తెలుగు, తమిళ భాషల్లో మే 12వ తేదీన విడుదల కాబోతుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సినిమా తాలూకా ఫస్ట్ లుక్ టీజర్ ను గురువారం విడుదల చేసి ఆసక్తి నింపారు.

‘గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. అది ఇప్పుడు నన్ను తీసుకొచ్చింది ఒక యుద్ధానికి. ఇక్కడ చావు నన్ను వెంటాడుతోంది. అది ఎటునుంచి వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో నాకు తెలీదు. తెలుసుకోవాలని కూడా లేదు. ఎందుకంటే, నా చేతిలో ఉన్న ఆయుధం ఒక నిజం’ అంటూ నాగచైతన్య వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అయిన టీజర్ ఒక నిమిషం 28 సెకెండ్ల పాటు చాలా ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా నాగచైతన్య రెట్రో లుక్ అభిమానులను కట్టిపడేస్తుంది. ఈ సినిమాలో నాగచైతన్య పోలీస్ కానిస్టేబుల్‌గా కనిపించనున్నారు. టీజర్ ను బట్టి చూస్తే..మంచి యాక్షన్ తో కూడిన చిత్రంగా తెరకెక్కినట్లు అర్ధమవుతుంది.

ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషించాడు. ‘బంగార్రాజు’ తరువాత చైతూ – కృతి శెట్టి కలిసి నటిస్తున్న సినిమా ఇది. దీంతో ఈ మూవీ ఫై అందరిలో ఆసక్తి పెరుగుతుంది. ఇక ఈ మూవీ ఈ ఇద్దరికీ చాల కీలకంగా మారింది. వీరిద్దరూ ప్రస్తుతం వరుస ప్లాప్స్ లో ఉన్నారు. దీంతో ఈ మూవీ ఫైనే వారితో పాటు , అభిమానులు ఆశలు పెట్టుకుని ఉన్నారు. చిట్టూరి శ్రీనివాస్ ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.

YouTube video