మెగా ఇంట్లో మొదలైన పెళ్లి సంబరాలు

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ అతి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. నటి లావణ్య త్రిపాఠి ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ మధ్యనే పెద్ద‌ల స‌మ‌క్షంలో ఎంగేజ్ మెంట్ కార్య‌క్ర‌మం పూర్తీ చేసాడు.తాజాగా ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ మొదలయ్యాయి.

మెగాస్టార్ చిరంజీవి ఇల్లు అందుకు వేదికగా నిలిచింది. ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్ ని కాబోయే దంప‌తులతో పాటు ఫ్యామీలీ అంతా ఎంజాయ్ చేసారు. చిరంజీవి ఇంట్లో కుటుంబ స‌భ్యులంతా గేద‌ర్ అయ్యారు. వాళ్ల‌తో పాటు వ‌రుణ్ తేజ్-లావ‌ణ్య లు కూడా ఉన్నారు. తాజాగా నెట్టింట ఆ సెల‌బ్రేషన్ కిచెందిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. అందులో చిరంజీవి..రామ్ చ‌ర‌ణ్ దంప‌తులుతో పాటు మొత్తం కుటుంబ స‌భ్యులంతా క‌నిపిస్తున్నారు.