డిగ్రీ కాలేజీలలో కూడా ‘నాడు-నేడు’

AP Minister Suresh

Vijayawada: వచ్చే ఏడాది నుంచి డిగ్రీ కాలేజీలలో కూడా ‘నాడు-నేడు’ ఏర్పాటు చేయబోతున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్‌ వెల్లడించారు. ఇంటర్మీడియట్‌ విద్యపై మానిటరింగ్‌ కోసం పలు పైవేటు కాలేజీ యాజమాన్యాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌వెూహన్‌రెడ్డి ప్రభుత్వం వివిధ రకాలైన మార్పులను తీసుకువస్తుందన్నారు.

కాలేజీలు వ్యాపార ధోరణిలో వెళ్లకుండా ఉండాలని యాజమాన్యాలకు సూచించారు. జూనియర్‌ కాలేజీలలో కోచింగ్‌ సెంటర్స్‌ నడపడానికి వీలు లేదని యాజమాన్యాలకు స్పష్టం చేశారు. నాణ్యత ప్రమాణాలు పాటించని కాలేజీలపై కచ్చితంగా దృష్టి పెడతామన్నారు.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com