రాష్త్రవ్యాప్తంగా నాటుసారా ఏరులై పారుతుంది : వ‌ర్ల రామ‌య్య

అమరావతి: ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై అధికార వైస్సార్సీపీ, విప‌క్ష టీడీపీ ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు సంధించుకుంటూనే ఉన్నాయి. ఆ మరణాలన్నీ సహజ మరణాలేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. ఈనేపథ్యంలో తాజాగా ఈ విష‌యంపై టీడీపీ సీనియర్ నేత వ‌ర్ల రామ‌య్య స్పందించారు.

‘’రాష్త్రవ్యాప్తంగా నాటుసారా ఏరులై పారుతూ, ఎందరో వ్యసనపరుల ప్రాణాలు తీస్తుంటే,నాటుసారా మరణాలన్నీ సహజ మరణాలని సెలవిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. జంగారెడ్దిగూడెo లోనే ఎందరో నాటుసారా విక్రయదారులు, కాపు దారులు అర్రెస్ట్ అయ్యారు. తర్వాత, రాష్త్రవ్యాప్తంగా దాడులకు బ్రేకు పడింది, ఎందుకు సార్?’’ అంటూ వర్ల రామయ్య ప్రశ్నించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/