నేటి నారా లోకేష్ యువగళం షెడ్యూల్ ..

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 32 వ రోజుకు చేరింది. నిన్నటితో 400 కిమీ పూర్తి చేసాడు లోకేష్. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని గుమ్మడివారి ఇండ్లు విడిది కేంద్రం నుంచి లోకేష్ తన యాత్ర ను ప్రారంభించారు. నిన్న ఆయన 13 కిలోమీటర్ల దూరం నడిచారు.

ఈరోజు లోకేశ్ పాదయాత్ర షెడ్యూల్:

ఉదయం 8 గంటలకు గుమ్మడివారి ఇండ్లు విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.10 గంటలకు పోలవరపు ఇండ్లు గ్రామంలో బీసీ నాయకులతో మాటామంతీ.
10.20 గంటలకు దామలచెరువులో గ్రామస్తులతో భేటీ.
10.40 గంటలకు దామలచెరువులో ముస్లిం సామాజికవర్గీయులతో ముఖాముఖి.
మధ్యాహ్నం 12.15 గంటలకు కొండేపల్లి క్రాస్ వద్ద భోజన విరామం.
2.20 గంటలకు కొండేపల్లి క్రాస్ వద్ద రైతులతో ముఖాముఖి.
3.00 గంటలకు కొండేపల్లి క్రాస్ నుంచి పాదయాత్ర పునః ప్రారంభం.
సాయంత్రం 4 గంటలకు మొగరాల గ్రామస్థులతో మాటామంతీ.
5.00 గంటలకు పుంగనూరు నియోజకవర్గంలోకి ప్రవేశం.
6.15 గంటలకు పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం కొమ్మురెడ్డిపల్లి విడిది కేంద్రంలో బస చేయనున్నారు.