దేశంలో కొత్తగా 176 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 92,955 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 176 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 44,678,822కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,670 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మహమ్మారి కారణంగా ఒకరు మృతి చెందడంతో.. మొత్తం మరణాల సంఖ్య 5,30,707కి చేరింది.
ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.01 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని వెల్లడించింది. రికవరీ రేటు 98.80 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.10 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.