జనసేన లోకి దాడి వీరభద్రరావు ..?

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ వైస్సార్సీపీ కి వరుస షాకులు ఎదురవుతన్నాయి. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్స్ ఇచ్చేది లేదని చెప్పడం , పలు నియోజకవర్గాల్లో మార్పులు చేస్తుండడం తో ఆయా నేతలు జగన్ కు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు వైస్సార్సీపీ ని వీడి టిడిపి , జనసేన పార్టీలలో చేరగా..మరికొంతమంది అతి త్వరలోనే చేరేందుకు సిద్దమవుతున్నారు. తాజాగా మంగళవారం మాజీ మంత్రి దాడి వీరభద్రరావు..వైస్సార్సీపీ కి రాజీనామా చేసారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి , వైస్సార్సీపీ అధినేత జగన్ ను పంపించారు. వైస్సార్సీపీ కి రాజీనామా చేసే ముందు ఆయన జనసేన వర్గాలతో సంప్రదింపులు జరిపారని తెలుస్తుంది. కొద్ది రోజుల్లో ఆయన జనసేనలో చేరే అవకాశాలు ఉన్నట్లుగావినికిడి.

దాడి వీరభద్రరావు టీడీపీలో మంత్రిగా పని చేశారు. అయితే జగన్ జైల్లో ఉన్న సమయంలో ఆయనను కలిసి వైస్సార్సీపీ లో చేరారు. 2014 ఎన్నికల్లో ఆయన కుమారుడు దాడి రత్నాకర్ విశాఖ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. వైస్సార్సీపీ ఓడిపోవడంతో ఆయన కొద్ది కాలానికి వైస్సార్సీపీకి రాజీనామా చేశారు. కానీ ఏ పార్టీలో చేరలేదు.