చంద్రబాబు భార్య భువనేశ్వరి కి క్షేమపణలు చెప్పిన వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ..నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి కి క్షేమపణలు చెప్పారు. భువనేశ్వరిపై వంశీ నెల క్రితం నోరు పారేసుకోవడం తీవ్ర సంచలనం రేకెత్తించింది. వంశీ మాటల ఫై తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ తర్వాత అసెంబ్లీ లో వైసీపీ నేతలు చంద్రబాబు ఫై , ఆయన భార్య భువనేశ్వరి ఫై పలు అసభ్య వ్యాఖ్యలు చేయడంతో చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారు. ఆ తర్వాత జాతీయ స్థాయిలో చంద్రబాబు ఫై ఘటన ఫై సీరియస్ అయ్యారు. చంద్రబాబు సైతం పలుమార్లు ఈ ఘటన గురించి ప్రజలకు చెపుతూ వస్తున్నారు.
ఇదిలా ఉంటె తాజాగా ఓ చానల్లో వల్లభనేని వంశీ మాట్లాడుతూ…చంద్రబాబు సతీమణిపై తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. టీడీపీ సోషల్ మీడియాలో లోకేశ్ తన భార్య, చెల్లి, భార్యపై అభ్యంతరకర పోస్టులు పెట్టిస్తున్నాడని, అలాంటి వాటికి సమాధానం ఇచ్చే క్రమంలో భువనేశ్వరిపై ఒక పదం తప్పుగా దొర్లిందని వంశీ ఒప్పుకున్నారు. భవిష్యత్లో తన నుంచి ఇలాంటివి పునరావృతం కావన్నారు.
భువనేశ్వరికి క్షమాపణ చెబుతున్నానన్నారు. టీడీపీలో అందరికంటే తనకు భువనేశ్వరి సన్నిహితమని చెప్పుకొచ్చారు. ఆమెను అక్కా అని పిలుస్తానన్నారు. ఎమోషన్లో భువనేశ్వరిపై మాట తూలినట్టు అంగీకరిస్తున్నానన్నారు. కమ్మ కులం నుంచి వెలేస్తామనే హెచ్చరికతో తాను క్షమాపణ చెప్పడం లేదన్నారు. మరి వంశీ క్షేమపణలతో ఈ ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.