తన కొడుకు విషయంలో సిరివెన్నెల ఎంతో మదనపడ్డారట..

తన కొడుకు విషయంలో సిరివెన్నెల ఎంతో మదనపడ్డారట..

ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణం.. అభిమానులతో పాటు టాలీవుడ్​లో విషాదం నింపింది. దీంతో నటులు, దర్శకులు, నిర్మాతలు.. సోషల్ మీడియా వేదికగానే కాకుండా..పార్థివదేహానికి నివాళ్లు అర్పించారు. అయితే సిరివెన్నెల కు మాత్రం ఓ కోరిక అలాగే ఉండిపోయిందట. అదే తన కొడుకు రాజా విషయంలో. తన కొడుకు రాజాను ఒక మంచి నటుడిగా తెలుగు ఇండస్ట్రీలో చూడాలని సిరివెన్నెల కోరిక.

దాదాపు 14 ఏళ్ల క్రితం దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘కేక’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు రాజా. తర్వాత ‘ఎవడు’ సినిమాలో విలన్‌గా, అనంతరం ‘ఫిదా’లో వరుణ్‌తేజ్‌ అన్నయ్యగా నటించాడు. కొన్ని మంచి పాత్రలే దక్కినా కూడా రాజాకు రావాల్సిన గుర్తింపు అయితే రాలేదు. దీంతో తన కొడుకు కెరీర్‌ విషయంలో సిరివెన్నెల మదనపడ్డారని ఆయన సన్నిహితులు చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడైనా రాజా ఫై మన దర్శకుల కన్ను పడుతుందో లేదో…సిరివెన్నెల కోరిక తీరుస్తారో లేదో చూడాలి.