ఏపిలో మరో 9 కరోనా పాజిటివ్‌ కేసులు

వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడి

corona virus
corona virus

అమరావతి: ఏపిలో కరోనా కేసులు రోజురోజుకు మరింతగా పెరుగుతున్నాయి. నిన్న రాత్రి నుంచి నేడు ఉదయం 9గంటల వరకు జరిపిన పరీక్షల్లో కొత్తగా 9 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదయిన కరోనా కేసుల సంఖ్య 534 కు చేరుకుంది. కొత్తగా నమోదయిన కేసులలో కృష్ణా జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 3, పశ్చిమగోదావరి జిల్లాలో 3 కేసులు నమోదు అయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 14 మంది మరణించారు. ఈ వైరస్‌ బారినుండి 20 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. మరో 500 మంది ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా ఇప్పటివరకు అత్యధికంగా గుంటూరు జిల్లాలో 118 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. కర్నూలులో 111 కేసులు నమోదు అయ్యాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/