హాస్పటల్ లో చేరిన వల్లభనేని వంశీ

vallabhaneni vamshi
vallabhaneni vamshi

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హాస్పటల్ లో చేరారు. గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ప్రస్తుతం వైస్సార్సీపీ సానుభూతిపరుడిగా వంశీ కొనసాగుతున్నారు. వంశీ ప్రతిష్టాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), హైదరాబాద్ లో గతేడాది సీటు సాధించి అడ్వాన్స్ డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ పాలసీ (ఏఎంపీపీపీ) కోర్సు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నుంచి పంజాబ్ రాష్ట్రం మొహాలీ క్యాంపస్ లో ఆఫ్ లైన్ తరగతులకు వెళ్తున్నారు.

ఈ క్రమంలో మంగళవారం వంశీకి ఎడమ చేయి విపరీతంగా లాగడంతో వెంటనే మొహాలీలోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అక్కడి వైద్యులు వంశీకి పలు పరీక్షలు నిర్వహించి రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే ఖంగారు పడాల్సిన అవసరం ఏమిలేదని, వంశీ ఆరోగ్యం నిలకడగానే ఉందని , ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జి అవుతారని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.

వల్లభనేని వంశీ 1972లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, గన్నవరంలో జన్మించాడు. ఆయన 1995లో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ నుంచి ఎంవీఎస్సీ పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించాడు. వంశీ ప్రస్తుతం హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో పబ్లిక్ పాలసీలో అడ్వాన్స్డ్ మెనేజే మెంట్ కోర్సు చేస్తున్నాడు. రాజకీయ విషయానికి వస్తే.. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి దుట్టా రామచంద్రరావుపై 9400 ఓట్లతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై 838 ఓట్లతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.