పుష్ప ఐటెం బ్యూటీ సమంతనే..

గత కొద్దీ రోజులుగా పుష్ప లో సమంత కనిపించబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి కానీ క్లారిటీ మాత్రం రాలేదు. ఇక ఇప్పుడు ఆ క్లారిటీ వచ్చేసింది. ఈ మూవీ లో సమంత ఐటెం సాంగ్ చేయబోతోందని.. పుష్ప రాజ్ పక్కన అదిరిపోయే చిందులు వేయబోతుందని తెలుస్తుంది. ఈ నెల 26 నుంచి నాలుగు రోజులపాటు ఈ పాట చిత్రీకరణ జరగబోతున్నట్లు సమాచారం. నాగ చైతన్య తో విడాకుల అనంతరం సమంత మళ్లీ సినిమాల ఫై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇక పుష్ప విషయానికి వస్తే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ పార్ట్‌ 1.. పుష్ప ది రైజ్ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్పీడ్ చేసారు. ‘ఏ బిడ్డ ఇది నా అడ్డ‌’అంటూ సాగే నాల్గో పాట ను న‌వంబ‌ర్ 19న‌ విడుద‌ల చేయ‌బోతున్నట్లు ప్రకటించారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేసి అభిమానులను ఆకట్టుకున్నారు.

ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ లో గుబురు గ‌డ్డం, పొడ‌వైన జుట్టుతో ఎర్ర‌టి నిలువు బొట్టు పెట్టుకుని సోఫాలో స్టైల్‌గా కూర్చున్నాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు.