పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం ఫై నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ నటుడు సుమన్..సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఆదరణ, యూత్ ఫాలోయింగ్ అద్భుతంగా ఉంది. ఎక్కడికెళ్లినా ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇది పెద్ద అదృష్టమని చెప్పుకోవాలి అని అన్నారు.

బుధవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆల్ ఇండియా సుమన్ యువసేన ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటుచేసిన 2023 సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సుమన్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌కు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అది ఆయనకు దక్కిన అదృష్టం. అయితే రాజకీయాల్లో ఎదగాలంటే రాసిపెట్టి ఉండాలని అన్నారు.

రాజకీయం, వ్యాపారంలో ఏదైనా రాసిపెట్టి ఉండాలి. మనమంతా నటులమే. పవన్ కళ్యాణ్, నేను మాత్రమే యాక్టర్స్ కాదు.. మీరంతా యాక్టర్లే. మీకు భగవంతుడు కొన్ని పనులు అప్పజెప్పాడు. మీరు చేసే పనులు నేను చేయలేను.. నేను చేసే పనులు మీరు చేయలేరు. ఒడిశాలో పట్నాయక్ ఐదోసారి సీఎం అయ్యారు. 25 సంవత్సరాలు నిరంతరాయంగా ఆయన సీఎం. ఆయన సీఎం అవ్వాలని ఆల్‌రెడీ రాసి ఉంది. ఎప్పటి వరకు ఆ రాత ఉంటుందో అప్పటి వరకు అది నడుస్తుంది. మీరు నేను ఏమీ మార్చలేం. మారాల్సిన టైమ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మారిపోతుంది’ అని సుమన్ అన్నారు. ఒక్కమాటలో సుమన్ చెప్పుకొచ్చిన మాటలను బట్టి చూస్తే..పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడానికి టైమ్ రావాలని.. రాసిపెట్టి ఉంటే ఆయన సీఎం అవుతారని పరోక్షంగా చెప్పుకొచ్చారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు సుమన్ తెలిపారు.