నేడు జహీరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ పర్యటన

పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

హైదరాబాద్: నేడు మంత్రి కేటీఆర్‌ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని జహీరాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. నిమ్జ్‌లో ఏర్పాటు చేస్తున్న తొలి పరిశ్రమ స్థాపనకు భూమిపూజ చేస్తారు. దీనిని వీఈఎం టెక్నాలజీస్‌ సంస్థ 511 ఎకరాల్లో రూ.వెయ్యి కోట్లతో నిర్మిస్తున్నది. అనంతరం వాయు ఈవీ పరిశ్రమను ప్రారంభిస్తారు. మహీంద్రా ట్రాక్టర్లు 3 లక్షల యూనిట్ల ఉత్పత్తి పూర్తయిన సందర్భంగా కంపెనీలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక స్మారకాన్ని ప్రారంభిస్తారు. తర్వాత జహీరాబాద్‌ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/