పేటీఎంలో వ్యాక్సిన్, స్లాట్ వివరాలు
పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ట్వీట్

పేటీఎం యూజర్లకు శుభవార్త చెప్పింది. కరోనా వ్యాక్సిన్ లభించే సమాచారంతో పాటు టైమ్‌స్లాట్ వివరాలను యాప్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ‘పేటీఎం వ్యాక్సిన్ స్లాట్ ఫైండర్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆయా స్లాట్లు అందుబాటులోకి వచ్చినప్పుడు ఖాతాదారులను అప్రమత్తం చేయనుంది. ఏజ్ గ్రూప్, పిన్ కోడ్‌ల ద్వారా కూడా ఈ వివరాలను తెలుసుకోవచ్చని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు. మొత్తం 780 జిల్లాల్లో వ్యాక్సిన్ లభ్యత సమాచారాన్ని అందించనున్నట్టు పేర్కొంది.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/