టీకా వేసుకో బీరు పుచ్చుకో.. ప్రభుత్వం బంపర్ ఆఫర్!

అవును మీరు చదివింది నిజమే.. కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఓ చోట మాత్రం వ్యాక్సిన్ వేసుకునేందుకు జనం మొండికేస్తుండటంతో అక్కడి ప్రభుత్వం ఇలాంటి వినూత్నమైన ఆఫర్‌ను ప్రకటించింది. దీంతో బీరు తాగేందుకు యువత ఆసక్తిగా ఉంటారని, తద్వారా వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు వస్తారని అధికారులు భావిస్తున్నారు.

ఈ ఆఫర్ గురించి తెలుసుకుని మీరు కూడా వెంటనే వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే కాస్త ఆగండి. ఈ వినూత్నమైన ఆఫర్ అమెరికా ప్రభుత్వం అక్కడి ప్రజలకు అందించాలని నిర్ణయించుకుంది. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో యువత వ్యా్క్సిన్ వేసుకునేందుకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదట. దీంతో అక్కడి ప్రభుత్వం ఈ వినూత్నమైన ఆలోచనను అమలు చేసేందుకు చూస్తోందట. వ్యాక్సిన్ వేసుకునే వారికి ఉచితంగా బీరు అందించనున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.

మొత్తానికి యువతను వ్యాక్సిన్ వేసుకునేలా చేసేందుకు అమెరికా ప్రభుత్వం ప్రకటించిన ఈ ఆఫర్‌తో అక్కడి యువత వ్యాక్సిన్ వేసుకునేందుకు బారులు తీరుతున్నారట. ఏదేమైనా వ్యాక్సిన్ పుణ్యమా అని బీరు ఫ్రీగా దొరుకుండటంతో అక్కడి యువత ఫుల్ ఖుషీగా ఉన్నారట.