వైస్సార్సీపీ కి షాక్ : టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే మునిరామయ్య

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వైస్సార్సీపీ పార్టీ లో అసమ్మతి సెగ రోజు రోజుకు ఎక్కువుతున్నాయి. ఇప్పటికే పలువురు అధిష్టానం ఫై విమర్శలు , ఆరోపణలు చేస్తుండగా..మరికొంతమంది పార్టీ కి రాజీనామా చేసి టీడీపీ లో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు చేరగా..తాజాగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత సత్రవాడ మునిరామయ్య టీడీపీ లో చేరారు. ఆయనతో పాటూ కుమారుడు ప్రవీణ్, అనుచరులకు అధినేత చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్బంగా మునిరామయ్య మాట్లాడుతూ..ఈ ప్రభుత్వ విధ్వంస పాలనను నిరసిస్తూ వైస్సార్సీపీకి గుడ్ బై చెప్పానని.. టీడీపీ ప్రభుత్వంతోనే రాష్ట్ర భవిష్యత్ బాగుంటుంది అందుకే టీడీపీ లో చేరినట్లు తెలిపారు. మంచి వ్యక్తిత్వం, నిజాయితీ ఉన్న మునిరామయ్య మళ్లీ టీడీపీలో చేరడం తనకు ఆనందంగా ఉందన్నారు చంద్రబాబు. ఆయన కుమారుడు ప్రవీణ్ కు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చారు.

మునిరామయ్య రాజకీయాల విషయానికి వస్తే.. 1985లో జరిగిన ఎన్నికల్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా మునిరామయ్య గెలిచారు. రెండన్నరేళ్ల పాటు శాసనసభ్యులుగా ఉన్నారు.. అనంతరం కొన్ని రాజకీయ పరిస్థితులతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కొంతకాలం తర్వాత కుమారుడు ప్రవీణ్ వైస్సార్సీపీ లో చేరడంతో.. మునిరామయ్య కూడా అదే బాటలో నడిచారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైస్సార్సీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదనరెడ్డి విజయం కోసం పనిచేశారు. మునిరామయ్య కుమారుడు ప్రవీణ్‌కు జగన్ రాష్ట్ర యువతి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు.