నాలుగు రోజుల‌పాటు టీకా ఉత్స‌వ్‌ ‌

రోజుకు కనీసం 6 లక్షల మందికి వ్యాక్సిన్‌: సీఎం జ‌గ‌న్ ఆదేశం

AP CM YS Jagan
AP CM YS Jagan

Amaravati: కేంద్రం చెప్పిన విధంగా ఈ నెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు చేపట్టనున్న టీకా ఉత్సవ్‌ సమయంలో రోజుకు కనీసం 6 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేలా చూడాలని సీఎం జ‌గ‌న్ ఆదేశించారు. ఆ నాలుగు రోజులు కనీసంగా 24 లక్షల మందికి వాక్సిన్‌ ఇచ్చేలా కార్యాచరణ చేయాలన్న సీఎం ఈ మేరకు వ్యాక్సిన్‌ డోసులు కేంద్రాన్ని కోరాలని అధికారులను ఆదేశించారు. కేంద్రంలోని అధికారులతో సమన్వయం చేసుకోవాలని అన్నారు

ఎన్నికలు ముగిసినందున వ్యాక్సిన్‌పై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని. దీనికోసం అన్నిరకాలుగా సిద్ధం కావాలని అధికారులకు చేశారు. సీఎం దీన్ని విజయవంతంగా చేశాక మరిన్ని డోసులు తెప్పించుకోవడంపై దృష్టిపెట్టాలని సూచించారు.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/