మాస్క్ లేకుండా తిరిగితే రూ. 1000 జరిమానా

నిబంధనలను కఠినంగా అమలు చేయాలి: సిఏం కేసిఆర్

TS CM KCR
TS CM KCR

Hyderabad: దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా ప్రభుత్వ నిభందనలు పాటిస్తూ జాగ్రత్తలు చేపట్టాలని తెలంగాణ సీఎం కే సి ఆర్ అన్నారు. కరోనా నివారణ కోసం కీలకమైన మాస్కులు ధరించే నిబంధనను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు మాస్కులను ధరించకపోతే రూ. 1,000 జరిమానా విధించేలా ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ప్రతి శ్రేయస్సు దృష్ట్యా ఈ నిబంధనను అందరూ పాటించాలని కోరారు. ఈమేరకు పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/