ఎంసెట్: ఇప్పటిదాకా 18,892 దరఖాస్తులు

అపరాధ రుసుముతో జూన్ 28 దాకా దరఖాస్తుల స్వీకరణ

TS EAMCET- 18,892 applications so far
TS EAMCET- 18,892 applications so far


‌Hyderabad: తెలంగాణలో ఎంసెట్ -2021 అప్లికేషన్స్ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కు హాల్ టికెట్స్ జారీ కావటంతో అప్లికేషన్స్ జోరు పెరిగింది. గురువారం వరకు ఎంసెట్ కు 18,892 దరఖాస్తులు వచ్చినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ ఏ . గోవర్ధన్ తెలిపారు. ఇంజినీరింగ్ కు 10,917, అగ్రికల్చర్ , ఫార్మసీ పరీక్షకు 7,975 మంది అప్లికేషన్స్ చేసుకున్నారు. మే 18 వరకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. అపరాధ రుసుముతో జూన్ 28 దాకా దరఖాస్తులను స్వీకరిస్తారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/