గాంధీజీపై ఉన్మత్త ప్రలాపాలా?

వార్తల్లోని వ్యక్తి (ప్రతి సోమవారం)

Mahatma Gandhi-

జాతిపిత మహాత్మాగాంధీని హేళన చేయడం, చులకన చేయడం ఈ మధ్య దేశంలో పెరిగి పోయింది! మొన్న అనంతకుమార్‌హెగ్డే అనే ఒక ఎమ్‌.పి మహాత్ముని మహాత్ముడే కాడని, ఆయన సత్యాగ్రహాలు బూటకాలని, ఆయన బ్రిటిష్‌వారితో లాలూచీ అయి, నాటకమాడాడని అవాకులు చవాకులు పేలాడు! ఆయన కర్ణాటకకు చెందినవాడు. ఒకసభలో మాట్లాడుతూ ఈ ప్రేలాపనలు వల్లించాడు.

అసలు ఈ పనికిమాలిన ఎమ్‌.పి. గాంధీజీని చూశాడా? ఆయనను గురించి చదివాడా? ఒక ప్రక్క దాదాపు ప్రతి దేశంలోను మహాత్ముని విగ్రహం వ్ఞంటే, ఈ పనికిమాలిన ఎమ్‌.పి.ఆ మహనీయునిపై అవాకులు చవాకులు ప్రేలడమేమిటి? అయినా ఆయన ప్రసంగం విన్న ప్రజలు ఎలా సహించారు? ఆయన మానసిక స్థితి ఎలా వ్ఞన్నదో కాళ్లూ చేతులూ కట్టివేసి, పరీక్ష చేయవద్దా? ఒకసారి ఇలాంటి ఉన్మత్త ప్రలాపాలు పేలకుండా బుద్ధిచెబితే, మరొకరు ఇలా వాగుతారా?
కరడుకట్టిన విన్‌స్టన్‌ చర్చిల్‌ వంటి బ్రిటిష్‌ సామ్రాజ్యవాది మహాత్ముని ‘దిగంబర సన్యాసి అన్నాడంటే, అర్థమున్నది. వారి సామ్రాజ్యానికి మహాత్ముడు ఎసరుపెట్టారు కాబట్టి వారికి ఆయనపై ఆగ్రహం రావడంలో ఆశ్చర్యం లేదు. మరి, ఈ ఎమ్‌.పికి ఏమి వచ్చింది? ఐక్యరాజ్యసమితి తీర్మానం సాక్షాత్తు ప్రపంచ దేశాలన్నీ సభ్యరాజ్యాలుగా వ్ఞన్న ఐక్యరాజ్యసమితే మహాత్మాగాంధీ జయంతి అయిన అక్టోబర్‌ 2వ తేదీని ‘అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరపాలని తీర్మానించింది. అలాంటప్పుడు హెగ్డే వంటి స్వదేశీయుడే మహాత్ముని అలా చులకన చేయడం విదేశీయులకు చులకనకాదా?
గాంధీజీపై ఒబామా భక్తి అమెరికా అధ్యక్షుడుగా వ్ఞన్నప్పుడు ఒబామాను ‘దివికేగిన మహనీయులు దిగివస్తే, వారిలో ఎవరితో కలిసి విూరు భోజనం చేయడానికి ఇష్టపడతారని ప్రశ్నిస్తే, ‘మహాత్మాగాంధీతో అని ఆయన ఠక్కున సమాధానమిచ్చారు. హెగ్డే అప్రాచ్యునికి ఆ మాత్రం జ్ఞానం లేదా?
ఐన్‌స్టీన్‌ వ్యాఖ్య ‘రక్తమాంసాలతో వ్ఞన్న అలాంటి మానవ్ఞడొకరు ఈ భూమిపై తిరగాడాడంటే, భావితరాల వారు నమ్మకపోవచ్చునని ప్రపంచ ప్రఖ్యాతశాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ గాంధీజీ హత్య జరిగినప్పుడు వ్యాఖ్యానించాడు. బెర్నార్డ్‌ షా ‘అతి సాత్వికత్వం బహుప్రమాదకరమనడానికిది నిదర్శనం అని ప్రపంచ ప్రఖ్యాత బ్రిటిష్‌ జర్నలిస్టు, నాటక కర్త జార్జిబెర్నార్డ్‌ షా గాంధీజీ మృతిపై వ్యాఖ్యానించాడు. అలాగే ఆయా దేశాల స్వాతంత్య్రోద్యమ నాయకులెందరో గాంధీజీని ఆదర్శంగా తీసుకున్నారు. మరి, కన్నడ ఎమ్‌.పి ఆ ప్రేలాపనలేమిటి?

గాడ్సేకు దేవాలయం!

ఆ మధ్య మహారాష్ట్రలో గాంధీజీని హత్య చేసిన వినాయక్‌ నధూరామ్‌ గాడ్సేకు దేవాలయాన్ని నిర్మించాలన్న ప్రయత్నం జరిగింది. ఇతర విషయాలను అలావ్ఞంచితే, ఒక ఘోరహంత కునికి దేవాలయం కట్టించాలనే ప్రయత్నం ‘పిచ్చి ముదిరింది రోకలి తలకు చుట్టమనడం లాంటిది కాదా? హెగ్డే ప్రలాపాలు కూడా అలాగే లేవా?

  • డాక్టర్‌ తుర్లపాటి కుటుంబ రావు, (‘పద్మశ్రీ ‘అవార్డు గ్రహీత)

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/