పెన్షన్లపై సిఎం జగన్‌ మాట తప్పారు

ట్విట్టర్‌లో విరుచుకుపడ్డ నారా లోకేశ్‌

Nara Lokesh
Nara Lokesh

అమరావతి: ఏపి సిఎం జగన్‌పై టిడిపి నేత నారా లోకేశ్‌ ట్విట్టర్‌ వేదికగా విమర్శించారు. ముఖ్యమంత్రిగా చేసిన మొదటి సంతకమే పెద్ద మాయ అని అన్నారు. మాట మార్చి, మడమ తిప్పి పెన్షనర్లను మోసం చేశారని విమర్శించారు. ‘నేను ఉన్నాను, రూ. 3 వేల పెన్షన్ పక్కా’ అని చెప్పిన జగన్… ఆ తర్వత నేను వినలేదు, నేను లేను అంటూ కేవలం రూ. 250 పెన్షన్ పెంచి అవ్వ, తాతలను మోసం చేశారని అన్నారు. 60 ఏళ్లు దాటిన ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వకుండా రాక్షస రాజ్యాన్ని తలపిస్తున్నారని చెప్పారు. పండుటాకులపై జగన్ ఎందు అంత కక్షో అర్థం కావడం లేదని అన్నారు. ఒకేసారి 7 లక్షల పెన్షన్లను ఎత్తేశారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు దివ్యాంగులకు కూడా పెన్షన్ తీసేయడానికి మీకు మనస్సు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఎత్తేసిన పెన్షన్లను తిరిగి ఇచ్చేంత వరకు అవ్వ, తాతలు, దివ్యాంగుల తరపున మొండి ప్రభుత్వంపై టిడిపి పోరాడుతుందని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/