పాఠశాలల పారిశుధ్య నిర్వహణకు ‘అమ్మఒడి’ నిధులా?

Sanitation in Schools
Sanitation in Schools

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 44,570 ప్రభుత్వ పాఠశాలలు న్నాయి. ఈ పాఠశాలల్లో చదువ్ఞకుంటున్న బాలబాలి కల వ్యక్తిగత పరిశుభ్రత కోసం పాఠశాలల్లోని పారిశుద్ధ్య గదుల్ని సక్రమంగా నిర్వహించాల్సిన అవశ్యకత ఉంది. అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి తల్లులందరికీ ఈ సందర్భంగా ఒక పిలుపునిచ్చారు. అది ఏమిటంటే? అమ్మఒడి కార్యక్రమం కింద ఏడాదికి పదిహేనువేల రూపాయల ఆర్థిక సహాయం పొందిన తల్లులు తమకు అందిన సహాయంలో తమవంతు విరాళం కింద ఒక వెయ్యి రూపాయలు పాఠశాల తల్లిదండ్రుల కమిటీకి అందచేయాలని, ఆ విధంగా జమచేసిన సొమ్ముతో తల్లిదండ్రుల కమిటీలు పాఠశాలల్లోని మరుగుదొడ్లు, గదుల పారిశుద్ధ్య నిర్వహణకు తగిన చర్యలు చేపట్టేందుకు వినియోగించాలని అన్నారు.

పాఠశాలల తల్లిదండ్రుల కమిటీలను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి పాఠశాలల పారిశుద్ధ్య నిర్వహణ గురించి తీసుకోవలసిన చర్యలను వివరించి అది తల్లిదండ్రుల బాధ్యతగా వారికి విశదీకరించాలని, ఆ సమావేశానికి హాజరైన తల్లులు వారివంతు విరాళంగా ప్రతి ఒక్కరు వెయ్యి రూపా యలు తల్లిదండ్రుల కమిటీ బ్యాంకు ఖాతాకు జమ చేయా ల్సిందిగా అభ్యర్థించాలన్నారు.

జిల్లా విద్యాశాఖాధికారి పాఠ శాలల్లో పారిశుద్ధ్యగదులు శుభ్రత నిర్వహణకు జిల్లాస్థాయిలో ప్రత్యేకంగా ఒక బ్యాంకు ఖాతా తెరవలాని, తల్లిదండ్రుల కమిటీ బ్యాంకు ఖాతాకి తల్లులు వారి వంతు విరాళంగా జమ చేసిన డబ్బుని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేకంగా పారిశుద్ధ్య గదుల శుభ్రత నిర్వహణ కోసం జిల్లా విద్యాశాఖా ధికారి ఆధ్వర్యంలో తెరచిన బ్యాంకు ఖాతాకు జమ చేయా లని, పాఠశాలల్లోని పారిశుద్ధ్య గదుల్ని ఎప్పటికప్పుడు శుభ్ర పరచడానికి ఒక ఆయాను తల్లిదండ్రుల కమిటీనే ఎంపిక చేయాలని, ఆ విధంగా ఎంపిక చేసుకున్న ఆయాకు నెలకు నాలుగువేల రూపాయల చొప్పున చెల్లించేందుకు తల్లిదండ్రుల కమిటీ తీర్మానించింది.

ఈ నాలుగువేల రూపాయలను జిల్లా స్థాయిలో జిల్లా విద్యాశాఖాధికారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్యాంకు ఖాతా నుంచి ఆయాకు చెల్లిస్తారు. అంతేకాకుండా పారిశుద్ధ్యానికి అవరమైన సామాగ్రిని కొనుగో లుకు అదనంగా రెండువేల రూపాయలను పాఠశాలకు ఇచ్చే కాంపొజిట్‌ గ్రాం టుల నుండి సమకూరుస్తారు. ఆ విధంగా పాఠశాలల్లో పారిశుద్ధ్యం సక్రమంగా అమలవ్ఞతున్నదీ లేనిదీ ప్రతిరోజూ ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించి ఫొటోల ద్వారా తెలియ చేయాలి. ఇందుకు అవసరమైన డిజిటల్‌ టూల్‌ రూపొందిం చడం జరుగుతుంది.

అంతేకాకుండా తల్లిదండ్రుల కమిటీలో ఉన్న సభ్యుల నుండి ముగ్గురిని తల్లిదండ్రుల సబ్‌ కమిటీగా ఏర్పాటు చేయాలని, ఆ సబ్‌కమిటీ వారు పాఠశాల ఆవరణలో ఉన్న పారిశుద్ధ్య గదుల నిర్వహణను ప్రతిరోజూ స్వయంగా పర్యవేక్షించి అందులో లోటుపాట్లను ప్రధానోపాధ్యాయుని దృష్టికి, తల్లిదండ్రుల కమిటీ దృష్టికి తీసుకురావాల్సిఉంటుంది. అదేవిధంగా గ్రామ సచివాలయంలోని విద్య-సంక్షేమ సహా యకుడు వారానికి మూడుసార్లు పాఠశాల ఆవరణలో ఉన్న పారిశుద్ధ్య గదుల నిర్వహణ సమక్రంగా అమలు జరుగుతున్న దీ లేనిది స్వతంత్ర సంస్థ ద్వారా పర్యవేక్షణ చేపట్టాలి. ఇందుకు గ్రామంలోని స్వయం సహాయ బృందాల సహకారం తీసుకోవడం జరుగుతుంది.

పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా అమలుజరిగేలా చూడటంలో విద్యార్థులపాత్రకూడా ముఖ్యమైనది. విద్యార్థులకు తాము పారిశుద్ధ్యగదుల్ని వినియో గించిన తర్వాతవాటిని తప్పనిసరిగా శుభ్రంగా ఉంచడంగురించి సమీక్షించాల్సి ఉంటుంది.లోటుపాట్లు ఉన్నట్లయితేవాటినిమెరు గుపర్చుకోవడం కోసం తగిన చర్యలు చేపట్టాలి. పారిశుద్ధ్య నిర్వహణలో నీటి వినియోగం గురించికూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిఉంటుంది.నీళ్లువృధా కాకుండా చూడాలి.ఈ అం శంపై తల్లిదండ్రులకు పూర్తి అవగాహన కల్పించడం కోసమే పాఠశాలల్లో పారిశుద్ధ్యనిర్వహణ తప్పనిసరిగాఅమలు జరిగేట ట్లు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టొద్దు అని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి.

ఈ విషయంలో సమాజం దృష్టిలో ప్రభుత్వం చాలా మంచిదని ఉపాధ్యాయులు మాత్రం కాదు అనే భావన కలిగించేలా ఈ ఉత్తర్వులు ఉన్నాయని ఉపాధ్యా యులు అంటున్నారు. కావ్ఞన ఈ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం ఉద్దేశ్యం మంచిదే అయినప్పటికీ దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే విధానం సరిగా లేదని అభిప్రాయం ఉపాధ్యాయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అమ్మఒడి సాయం పదిహేనువేల రూపాయలను తల్లుల ఖాతా లో వేసే ముందేదీనిపై విస్తృతప్రచారం కల్పించి ఉండాల్సింది.

తద్వారా ఉపాధ్యాయులపై భారంపడకుండా ఉండేది.అమ్మఒడి సాయం అందిన రెండు వారాల తర్వాత ప్రధానోపాధ్యాయుడు తల్లిదండ్రుల మీటింగ్‌పెట్టి పారిశుద్ధ్యంకోసం వెయ్యి రూపా యలు ఇవ్వమని అడిగితే ప్రజాస్పందన ఎలా ఉంటుందోనని భయం ఉపాధ్యాయులను వేధిస్తోంది. స్పందన ఉంటే పర్వా లేదు కానీ, స్పందన లేకపోతే అనవసరమైన ఊహాగానాలు తల్లిదండ్రుల్లో వస్తే పాఠశాల పనితీరులో ఉపాధ్యాయులు సమస్యలు ఎదుర్కోవచ్చు.దీనికంటే కూడా ప్రభుత్వమే తల్లుల ఖాతాలో పధ్నాలుగు వేల రూపాయలు వేసి ఆ వెయ్యి రూపా యలను సంబంధిత పాఠశాల తల్లిదండ్రుల కమిటీ అకౌంట్‌కి జమ చేసి ఉంటే బాగుండేది.

ఇప్పటికే వివిధరకాల యాప్‌లు, ఆన్‌లైన్‌లో సమాచారం నమోదుచేయడం, వివిధ రకాల మీటింగులు,అమ్మఒడికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రు లకు బోధనేతర కార్యక్రమానికి ఉపాధ్యాయులు పరిమితం కావలసిరావడం ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. ఈ పరిస్థి తుల్లో డబ్బులు వసూలుచేయడం తలకుమించిన భారమే.

ఇది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సాయంచేసే అంశమే అయినప్పటికీ తల్లి దండ్రులు వెయ్యి రూపాయలు ఇవ్వడానికి నిరాకరిస్తే ప్రధానో పాధ్యాయుల పట్ల విద్యాశాఖ ఉన్నతాధి కారుల తీరు ఎలా ఉండబోతుందో అని ఆందోళన కూడా ఉపాధ్యాయ వర్గాల్లో కనబడుతోంది. తల్లిదండ్రులను ఒప్పించే బాధ్యతను పాఠశాల కమిటీ ఛైర్మన్‌కు కానీ, గ్రామ సచివా లయానికి లేదా, గ్రామ వలంటీర్లకు అప్పగించాలి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి.

ఏదిఏమైనప్పటికీ ఈ వెయ్యి రూపాయలు తల్లిదండ్రుల నుంచి రాబట్టడం అనే విషయంపై ఉన్నతాధికారులు పునరాలోచన చేయాలి. గతంలో కూడా గత రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ నుంచి రాజధాని నిర్మాణం కోసం విద్యార్థుల నుంచి పది రూపాయలు సేకరిం చాలనే ఉత్తర్వులు ఇచ్చినప్పుడు అనేక విమర్శలు వచ్చాయి. రాజధాని నిర్మాణం కోసం విద్యార్థుల నుంచి విరాళాలు సేకరించడం విజయవంతం కాలేదు. వెయ్యి రూపాయలు తల్లిదండ్రుల నుంచి సేకరించడం వంటి బోధనేతర పనులు ఉపాధ్యాయులు చేపట్టడం వల్ల విద్యార్థులకు బోధనా సమయం తగ్గుతుంది. బోధన కుంటుపడుతుంది.

  • వి.సురేష్‌

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/