Auto Draft

తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 70వేలకు పైగా చిన్ననీటివనరులు కనుమరుగు!

Small water sources
Small water sources

ముఖ్యంగా చిన్ననీటివనరుల్లో నీరులేని సమయంలో సాగుచేసుకొ నేందుకు ‘ఏక్‌సాల్‌ పట్టా ఇచ్చే కార్యక్రమం ఆరంభించి నప్పటి నుండి ఈ దుర్ధశ మొదలైందని చెప్పచ్చు.

దీనికితోడు జనాకర్షక పథకాల మీద శ్రద్ధ పెరిగి తమ పదవులను కాపాడు కునేందుకు తాత్కాలిక ప్రయోజనాలను చేకూర్చే పథకాలకు ప్రాధాన్యత ఇచ్చి శాశ్వత ప్రయోజనాలు ఇచ్చే ఇలాంటి కార్య క్రమాలకు తిలోదకాలు ఇచ్చారు.

ఇక భూముల విలువ పెరుగు తుండటంతో ఆక్రమణలు కూడా పెరిగిపోయాయి. ఫలితంగా తెలుగురాష్ట్రాల్లో దాదాపు 70వేలకుపైగా చిన్ననీటివనరులు కనుమరుగైనట్లు అధికారవర్గాలే అంగీకరిస్తున్నాయి.

అ యితే అతివృష్టి లేకుంటే అనావృష్టి అన్నట్టుగా ప్రకృతి పగబట్టి వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తున్నది. తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వరదలతో ముంచెత్తివేసింది.

శతాబ్దకాలంలో ఏన్నడూ లేని రీతిలో వరుణదేవుడు విరుచుకుపడటంతో వేలాది కుటుంబాలు నిరాశ్రయులైనాయి.

కోట్లాది రూపాయల విలువ చేసే పంటలు దెబ్బతిన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో చెరువు లు రాత్రికి రాత్రే నిండి పొంగి, గట్లు తెగికాలనీలకు కాలనీ లనే ముంచెత్తివేశాయి.

ప్రకృతితోపాటు ప్రభుత్వాలు కూడా ప్రజా నీకంతో ఆడుతున్న నాటకాల దుష్ఫలితం ఇది. మనిషికి మనిషి చేస్తున్న ద్రోహం.

ఈ నెల రెండోవారంలో బంగాళాఖాతంలో ఏర్ప డిన వాయుగుండం తీర ప్రాంతాన్ని రెండు రోజుల పాటు వణి కించి 13వ తేదీన ఉదయం తీరందాటి పోతూ, పోతూ సృష్టిం చిన విధ్వంసం అంతా ఇంతా కాదు.

ఆంధ్రప్రదేశ్‌లో ఏడు జిల్లాల్లోని ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేసి మూడు లక్షల ఎకరాలకు పైగా పంటలను నీటముంచి మధ్యాహ్నం ఖమ్మం చేరుకొని సాయంత్రా నికి హైదరాబాద్‌ నగరంపై విరుచుకుపడి ప్రళయమే సృష్టించింది.

112యేళ్ల క్రితం 1908లో సెప్టెంబరు 28వ తేదీన కురిసిన భారీవర్షం తర్వాత మళ్లీ ఇంత పెద్ద భారీ వర్షం మొదటిసారి అని వాతావరణ నిపుణులే చెప్తున్నారు.

హైదరాబాద్‌ పరిస్థితి చిన్నా భిన్నమైంది. ఇప్పటికీ అనేక కాలనీ లలో వరద తగ్గినా బురద మాత్రం తగ్గడం లేదు. ఇక రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి.

ఉన్నదంతా ఊడ్చి తలతాకట్టు పెట్టి, ఎంతో శ్రమిస్తే, తీరా నోటికందనున్న పంట నీటిపాలు కావడం ఆయా ప్రాంత ప్రజలు తట్టుకోలేకపోతున్నారు.

అక్కడక్కడ నష్టాన్ని తట్టుకోలేక గుండె ఆగి మరణించిన సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.

ఎన్ని మాటలు చెప్పినా,ఎంత ఊరట నిచ్చినా, వారికి జరిగిన కష్టాన్ని, నష్టాన్ని పూడ్చడం సాధ్యమయ్యేపని కాదు. ఎందుకో ఈ ఏడాది వరుణదేవ్ఞడు తెలుగురాష్ట్రాలపై దెబ్బమీద దెబ్బతీస్తున్నాడు.

పచ్చ గా ఉంటే చూసి ఓర్వలేక పగబట్టి పంతం పూని కొడుతున్నట్లు గా ఉంది. హైదరాబాద్‌ విషయమే తీసుకున్నా ఈ వర్షాకాలంలో ఇప్పటివరకు నేటితో 97వరోజులుగా అక్కదో ఇక్కడో వర్షం కురు స్తున్నదనే చెప్పాలి. ఇవేమీ వర్షాలంటూ జనం ఆక్రందిస్తున్నారు.

ఇది అంతా ప్రకృతి చేస్తున్న బీభత్సం. కేంద్ర బృందం జరిగిన నష్టాలను పరిశీలించేందుకు గురువారం హైదరాబాద్‌కు చేరుకుం ది. దాదాపు పదివేల కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లినట్లు తెలంగాణా రాష్ట్ర అధికారులు కేంద్రబృందానికి నివేదించారు.

అసలు ఎందుకు ఈ పరిస్ధితి వస్తున్నది? భారీ వర్షాలకే కాదు చిన్న పాటి వానలకు కూడా రోడ్లు, కాలనీలు జలమయం అవుతున్నాయి.

రోడ్లపై మోకాల్లోతు నీరు నిలిచిపోవడం, గంటల తరబడి ట్రాఫిక్‌ స్తంభించడం సర్వసాధారణమైంది. భారీ వర్షాలకు నదులు ఉప్పొంగిపోవడం అర్థం చేసుకోవచ్చు.

కానీ తేలికపాటి వర్షాలకు కూడా నివాస ప్రాంతాలు జలమయమై జనజీవనం అతలాకుతలం చేయడానికి కారణాలు ఏమిటో ఆలోచించాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షపు నీటిని నిల్వచేసే చిన్ననీటి వనరులు కనుమరుగై పోయాయి.

సాగు కోసమో, ఇళ్ల నిర్మాణం కోసమో ఆక్రమణలకు గురై వేలాది చెరువ్ఞలు,కుంటలు జలవనరులు కళ్లముందే అదృశ్య మైపోయాయి, పోతున్నాయి.

గతంలో చిన్ననీటి వనరు లకు ఎంతో ప్రాధా న్యత ఇచ్చేవారు. కాకతీయులు, ఆ తర్వాత వచ్చిన కృష్ణదేవ రాయులు నుంచి బ్రిటిష్‌, నిజాం పాలకుల వరకు చిన్ననీటి వనరులకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చారు.

వాన నీటిని వృధాగా పోనీయకుండా భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొ ని ఒక పద్ధతిగా నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేశారు.

వాగులు, వంకలు, వర్రెలకు అడ్డుకట్టవేసి నీటిని మళ్లించి చిన్ననీ టి వనరులను ఏర్పాటు చేయడం, అవి నిండిన తర్వాత అలు గుల ద్వారా కింద మరో చెరువ్ఞకు, కుంటకు వెళ్లే విధంగా నీటి యాజమాన్య పద్ధతులను అనుసరించారు.

ఇలా చిన్న చిన్న కుంటలు, చెరువుల నుంచి వెలువడని వర్షపు నీటి ఆధారంగా పెద్ద చెరువులు,రిజర్వాయర్లు నిర్మించారు.

వరంగల్‌ జిల్లా రామప్ప, పాకాల, లక్కవరం, ఖమ్మం జిల్లా పాలేరు, ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కంబం లాంటి పెద్ద చెరువులు ఇలా ఏర్పడినవే.

ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్‌ పాలకులు తెలంగాణ ప్రాంతంలో నిజామ్‌ నవాబులు చిన్ననీటివనరుల పట్ల ప్రత్యేక శ్రద్ధకనబరచారు.

చెరువులు తెగిపోకుండా, గండ్లుపడకుండా అవ సరమైన భద్రతాచర్య లు తీసుకోవడం,తెగిన వెంటనే మరమ్మతులు చేపట్టడం, కాల్వల్లో పూడిక తీయించడం వంటివి చేసే వారు.

ఇలాంటి కార్యక్రమాల్లో స్థానిక రైతులను, గ్రామస్తులను భాగస్వా మ్యం చేసేవారు. 1980 తర్వాత ఈ పరిస్థితి రానురాను కను మరుగైంది. ముఖ్యంగా చిన్ననీటివనరుల్లో నీరులేని సమయంలో సాగుచేసుకొ నేందుకు ‘ఏక్‌సాల్‌ పట్టా ఇచ్చే కార్యక్రమం ఆరంభించి నప్పటి నుండి ఈ దుర్ధశ మొదలైందని చెప్పచ్చు.

దీనికితోడు జనాకర్షక పథకాల మీద శ్రద్ధ పెరిగి తమ పదవ్ఞలను కాపాడు కునేందుకు తాత్కాలిక ప్రయోజనాలను చేకూర్చే పథకాలకు ప్రాధాన్యత ఇచ్చి శాశ్వత ప్రయోజనాలు ఇచ్చే ఇలాంటి కార్య క్రమాలకు తిలోదకా లు ఇచ్చారు.

ఇక భూముల విలువ పెరుగు తుండటంతో ఆక్రమ ణలు కూడా పెరిగిపోయాయి. ఫలితంగా తెలుగురాష్ట్రాల్లో దాదాపు 70వేలకుపైగా చిన్ననీటివనరులు కనుమరుగైనట్లు అధికారవర్గాలే అంగీకరిస్తున్నాయి.

1956 గణాం కాల ప్రకారం తెలంగాణ ప్రాంతంలో 11లక్షల ఐదువేల 119 ఎక రాలు చిన్ననీటివనరుల కింద సాగుఅయ్యాయి.

1998నాటికి అవి కాస్తా రెండు లక్షల అరవై ఆరువేల 174 ఎకరాలకు కుదించుకు పోయాయి. ఇప్పుడు తెలంగాణలో కేవలం 43వేల412 చెరువ్ఞ లు మాత్రమే ఉన్నాయి.

అలాగే హైదరాబాద్‌లో ఒకనాడు 650 చెరువులుండేవి, ఇప్పుడవి కేవలం 185కు కుదించుకుపోయాయి.

అనేక చెరువుల్లో కాలనీలు వెలిశాయి.వీటి నుండి నీరు బయటకు వెళ్లే నాలాలు ఆక్రమణలకు గురికావడంతో నీరు అంతా అక్కడే నిల్వఉండిపోతున్నది.

ఆయా కాలనీలకు చెందిన మురికినీరు కూడా అక్కడి లోతట్టు ప్రాంతాల్లోకి చేరుకొంటున్నది.

కొద్దిపాటి వాన వచ్చినా వర్షపు నీరు మురికినీటితో కలిసి రోడ్డుపైకి ప్రవహిస్తున్నది.

హైదరాబాద్‌ ముంపునకు కూడా ఇదే కారణం. చెరువు లు అదృశ్యంకావడం ఒక్కరోజులోనో, ఒక రాత్రిలోనో రహస్యంగా జరగలేదు. బహిరం గంగా జరిగిందే.

పాలకులకు తెలియకుండా కూడా కాదు. కొంద రు అధికారులు అడ్డుకున్నా వారిని శంకరగిరి మాన్యాలకు పట్టించారు. మీరాలం ట్యాంకు విషయాన్నే తీసుకుందాం.

ఆ చెరువును ఆక్రమించుకొని భవనాలను నిర్మించుకొని చివరకు జాతీయ రహదారినిపైకి చొచ్చుకవచ్చే ప్రయత్నం జరుగు తున్నప్పుడు అప్పటి హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిష నర్‌ రేచల్‌ చటర్జీ అడ్డుకొన్నారు,

ఎంతటి రాజకీయ ఒత్తిడి వచ్చి నా తలవొగ్గ కుండా బుల్డోజర్లు పెట్టి పెద్ద పెద్ద భవనాలను సైతం కూల్చివేశారు.

ఆమె తీసుకొన్న ఆ చర్యలకు ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు పెద్దఎత్తున మద్దతు పలికారు.కానీ ఆమెకు బదిలీబహు మానం దక్కింది.

అంతకుముందు కూడా నిజాయితీ, సమర్థులైన అధికా రులు ఈ ఆక్రమణలను అడ్డుకున్న సందర్భా లు ఎన్నో ఉన్నాయి. అలాంటి అధికారులకు కూడా శంకరగిరి మాన్యాలు తప్పలేదు.

కొన్ని కుంటలు ఆక్రమించుకొని కాలనీలు ఏర్పాటు చేస్తున్న కొందరు దళారుల ప్రయత్నాలను అధికారులు అడ్డుకొన్నప్పుడు ఢిల్లీ పెద్దలు జోక్యం చేసుకొన్న సందర్భాల గూర్చి కూడా స్థాని కంగా కథకథలుగా ఇప్పటికీ చెప్పుకొంటుంటారు,

ఇక నాలాల ఆక్రమణలు గూర్చి ఎంత తక్కువమాట్లాడితే అంత మంచి దేమో. నగరంలో ఎక్కడెక్కడ ఆక్రమణకు గురిఅయ్యేవో ఇప్పటి పాలకుల కు తెలియందికాదు.

నాలాల ఆక్రమణలపై ఎన్నోసార్లు అధ్య యనాలు చేసిన నిపుణుల కమిటీలు నివేదికలిచ్చాయి. కొన్ని సార్లు ఈ ఆక్రమణలు తొలగించేందుకు ప్రయత్నాలు జరిగాయి.

కానీ వాటికి ఆదిలోనే అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అర్థాంతరం గా ఎందుకు ఆగిపోతున్నయో అందరికి తెలిసిన బహిరంగ రహస్యమే.

ఆక్రమణలు తొలిగించే కార్యక్రమం దశాబ్ధలతరబడి మాట లకే పరిమితమౌతున్నది. ఇలాంటి సమస్యలెన్నో ఈ ముంపుకు కారణాలౌతున్నాయి. తిలాపాపం తలాపిడికడు అన్నట్లు ఇందులో అందరూ పెద్దలు భాగస్వాములే.

వీటిని పరిష ్కరించకుండా హైద రాబాద్‌ను అంతర్జాతీయస్థాయిలో విశ్వనగరంగా తీర్చిదిద్దడం సాధ్య మయ్యేపనేనాఅనేది పాలకులుమనసు పెట్టి ఆలోచించాలి.

  • దామెర్ల సాయిబాబ

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/