ఉత్తరాఖండ్ : లోయలోకి బస్సు బోల్తా
14మంది మృతి

ఉత్తరాఖండ్ లో విషాదం అలముకుంది. చంపావత్ జిల్లాలో బస్సు లోయలో పడి 14మంది మృతి చెందారు. వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. సుఖిదాంగ్-దాందమినార్ రహదారిపై వస్తుండగా పక్కనున్న లోయలో బస్సు పడింది. మంగళవారం తెల్లవారుజామున తర్వాత వీరంతా బస్సు లో తిరిగి స్వస్థలాలకు బయల్దేరారు. వాహనం అదుపు తప్పింది. ఒక్కసారిగా రహదారి పక్కన ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. మృతులంతా పెళ్ళివారి బంధువులేనని పోలీసులు తెలిపారు.
అంతర్జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/international-news/