మూడేళ్ల తర్వాత తెలంగాణ లో కనువిందు చేసిన రాబందులు

దాదాపు మూడేళ్ళ తర్వాత తెలంగాణ లో రాబందులు కనువిందు చేసాయి. కొన్ని ఏళ్ల క్రితం ఎక్కువగా కనిపించే రాబందులు..క్రమేపి అంతరించిపోయాయి . మూడేళ్లు గా ఎక్కడ కూడా కనిపించకపోయేసరికి ఇక రాబందులు ఇక లేవు అని అంత భావించారు. కానీ మూడేళ్ల తర్వాత తెలంగాణలోకి అడుగుపెట్టాయి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచికల్ మండలంలోని నందిగావ్ గ్రామ సమీపంలో ఉన్న పాలరావు గుట్ట కొండపై ఉన్న కాలనీకి ఇటీవల చేరుకున్నాయి.

2019 లో పడిన భారీ వర్షాల కారణంగా 20 పొడవాటి రాబందులు ఇక్కడ నుంచి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని రాబందుల అభయారణ్యంలోకి వెళ్లాయి. ఇప్పుడు మూడేళ్ల తర్వాత మూడు జతల రాబందులు తిరిగి ఇక్కడికి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. కొండచుట్టూ ఎగురుతూ ఉండగా వీటిని గుర్తించినట్లు ఆసిఫాబాద్ జిల్లా అటవీశాఖ ఇంచార్జ్ జీ.దినేష్ కుమార్ స్పష్టం చేశారు. డిసెంబర్‌లో వాటి సంతానోత్పతి కాలమని, ఇప్పుడు అవి రావడం మంచి పరిణామమని తెలిపారు. దీని వల్ల వాటి జనాభా కూడా పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.