పూనకాలు తెప్పిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ లుక్

అభిమానుల్లో పూనకాలు పుట్టిస్తుంది ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ ఫస్ట్ లుక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కలయికలో ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ తాలూకా ఫస్ట్ లుక్ వీడియో ఈరోజు సాయంత్రం రిలీజ్ కానుంది..అంతకు ముందే ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసి అభిమానుల్లో సంబరాలు నింపారు హరీష్ శంకర్.

ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వీడియోను ఈ సాయంత్రం 4:59 గంటలకు యూట్యూబ్ లో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ యూట్యూబ్ షేక్ అవడం పక్క అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ తరుణంలోనే.. ఈ సినిమా నుంచి పవన్‌ కళ్యాణ్‌ ఫస్ట్‌ లుక్‌ ను రిలీజ్‌ చేసి.. ఫ్యాన్స్‌ పండగ వాతావరణాన్ని అందించారు. కాగా, ఈ సినిమాలో పవన్ కు జోడీగా శ్రీలీల హీరోయిన్ గా చేస్తుండడం విశేషం. ఇక మరో సారి దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నాడు. పవన్‌కల్యాణ్‌ హీరోగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ‘గబ్బర్‌ సింగ్‌’ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్టైన సంగతి తెలిసిందే! 11 ఏళ్ల తర్వాత పవన్‌ – హరీశ్‌శంకర్‌- దేవిశ్రీ ప్రసాద్‌ కాంబినేషన్‌లో సినిమా వస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో పవన్‌ పోలీస్‌ అధికారిగా కనిపిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.