సీఎం రేవంత్ ఫై మల్లారెడ్డి ప్రశంసలు

బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి..సీఎం రేవంత్ రెడ్డి ఫై ప్రసంశలు కురిపించారు. రేవంత్ రెడ్డి సీఎం అవుతారని పదేళ్ల కిందటే తాను చెప్పినట్లు మల్లారెడ్డి పేర్కొన్నారు. ‘టీడీపీలో ఉన్నప్పుడు నేను, రేవంత్ మంచి స్నేహితులం. గతంలో రేవంత్పై తొడగొట్టడం, తిట్టడం వంటివి రాజకీయపరంగా చేసినవే. వ్యక్తిగతంగా నాకు రేవంత్తో ఎలాంటి గొడవలు లేవు అన్నారు.

2014లో బొల్లారంలోని తోట ముత్యాలమ్మ దేవాలయంలో దివంగత ఎమ్మెల్యే సాయన్న ఇచ్చిన విందుకు హాజరైన సందర్భంలో తాను స్వయంగా రేవంత్‌రెడ్డితో ఈ విషయం చెప్పినట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను కంటోన్మెంట్‌ జయానగర్‌ కాలనీలోని తన కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. తాను వేరే పార్టీలో చేరేది లేదన్నారు. గతంలో రేవంత్‌రెడ్డిపై తొడగొట్టి చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయపరంగానే చేసినవేనని.. వ్యక్తిగతంగా కాదన్నారు. తామంతా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎంతో స్నేహంగా మెలిగేవారమన్నారు. తన కుమారుడు భద్రారెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడని, అతను ఏ పార్టీ నుంచి పోటీ చేసినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.