సరికొత్త లుక్ తో షాక్ ఇచ్చిన సూర్య

తమిళ్ హీరో సూర్య సరికొత్త లుక్ తో అందరికి షాక్ ఇచ్చాడు. ఇప్పటివరకు సన్నగా కనిపిస్తూ వచ్చిన సూర్య..తాజా లుక్ లో మాత్రం గుబురు గడ్డంతో పాటు కాస్త బరువు పెరిగినట్లు కనిపించాడు. ఈ లుక్ లో సూర్య ను చూసి అంతా కూడా షాక్ అవుతున్నారు. సూర్య ను ఇలా ఎప్పుడు చూడలేదు అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం సూర్య శివ దర్శకత్వంలో భారీ పీరియాడిక్ సినిమా ‘కంగువ’ ను చేస్తున్న సంగతి తెలిసిందే.

రూ.200 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఆ సినిమాలో సూర్య యుద్ధ వీరుడి పాత్రలో కనిపించడంతో పాటు మరో ముఖ్యమైన పాత్రలో కూడా కనిపిస్తాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ పాత్ర కోసం సూర్య బరువు పెరిగి ఉంటాడు అంటూ తమిళ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సూర్య కొడైకెనాల్ లో ఫ్యామిలీ తో హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తున్న సూర్య త్వరలో ఈ సినిమా చివరి దశ షూటింగ్ ని మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.