భారత్‌కు కృతజ్ఞతలు తెలిపిన అమెరికా

దలైలామాకు 1959 నుంచి ఆశ్రయం ఇస్తున్నందుకు భారత్ కు ధన్యవాదాలు..అమెరికా

dalailama

అమెరికా: దలైలామా జన్మదినం (జూలై 6) సందర్భంగా అమెరికా ఓ ప్రకటన వెలువరించింది. దలైలామాకు 1959 నుంచి ఆశ్రయం ఇస్తున్నందుకు భారత్ కు ధన్యవాదాలు తెలిపింది. ‘శాంతి, కరుణ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ యావత్ ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న దలైలామాకు 85వ పుట్టినరోజు శుభాకాంక్షలు. టిబెటన్ల సంఘర్షణకు, వారి వారసత్వానికి ప్రతీకగా నిలిచారు. అలాంటి మహనీయుడికి, టిబెటన్లకు ఆశ్రయం కల్పిస్తున్న భారత్ కు కృతజ్ఞతలు’ అంటూ అమెరికా విదేశాంగ శాఖ సెంట్రల్ ఏషియన్ అఫైర్స్ బ్యూరో ట్వీట్ చేసింది. అటు, అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ కూడా దలైలామాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో చైనాను క్రూరమైన దేశంగా అభివర్ణించారు. దలైలామా, ఇతర టిబెటన్ల ఆశలన్నీ అడియాసలుగా మిగిలిపోతుండడం బాధాకరమని, దుర్మార్గ చైనా హింసాత్మక పాలన ఇంకా కొనసాగుతూ ఉండడమే అందుకు కారణమని ఆరోపించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/