భారత్లో మరిన్ని కరోనా కేసులు
1,965 కేసులు.. 50 మరణాలు

దిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తుంది. దీంతో గడిచిన 12 గంటలలో 131 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో 1,965 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో 151 మంది కోలుకున్నారని , 1,764 మంది చికిత్సపొందుతున్నారని తెలిపింది. ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకు 50 మంది మరణించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/