108 వాహనాన్ని నడిపిన ఎమ్మెల్యె రోజా

నగరి నియోజకవర్గంలో వాహనాలకు పచ్చజెండా ఊపిన రోజా

mla-roja-drives-new-ambulance

పుత్తూరు: ఎమ్మెల్యే రోజా నగరి నియోజకవర్గంలో 108, 104 వాహనాలను ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ 108 అంబులెన్స్ ను రోజా స్వయంగా నడిపి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిన సిఎం జగన్‌ కొత్తగా 108, 104 వాహనాలను కొనుగోలు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని అన్నారు. చంద్రబాబుపైనా, టిడిపిపైనా ధ్వజమెత్తారు. మంచి పనులు చేస్తూ సిఎం జగన్ ప్రజల గుండెల్లో చోటు దక్కించుకుంటుంటే చంద్రబాబు, ఇతర టిడిపి నేతలు తిన్నది అరక్క ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, ఈ కార్యక్రమానికి వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఏపి సిఎం జగన్ ఇటీవలే ఆధునిక సౌకర్యాలతో కూడిన 108, 104 వాహనాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.  ఆ వాహనాలన్నీ జిల్లాలకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోఎమ్మెల్యే రోజా నగరి నియోజకవర్గంలో  108, 104 వాహనాలను ప్రారంభించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/