సబర్మతి నదీ తీరాన్ని సందర్శించనున్న ట్రంప్‌

trump
trump

న్యూఢిల్లీ: త్వరలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌కు రానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ట్రంప్‌ గుజరాత్‌లోని సబర్మతి నదీ తీరాన్ని సందర్శించనున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నార్త్‌ ఢిల్లీలోని శాస్త్రి నగర్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఆసియా ఖండంలోకెల్లా శుభ్రమైన నది సబర్మతి నది అని పేర్కొన్నారు. జపాన్‌, ఇజ్రాయెల్‌ ప్రధానులు సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ను సందర్శించి ఆశ్చర్య చకితులయ్యారన్నారు. అయితే వచ్చే నెలలో భారత్‌లో ట్రంప్‌ పర్యటన తేదీలు ఇంకా ఖారారు కాలేదు. అధికార వర్గాల సమాచారం ప్రకారం భారత్‌లో ట్రంప్‌ రెండు రోజుల పర్యటన వచ్చే నెల 2426 తేదీల మధ్య ఉండవచ్చునని తెలుస్తున్నది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/