ప్రశాంత్ కిశోర్ కు సీపీఐ నేత బహిరంగ లేఖ

నితీశ్ కుమార్ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు అభినందనలు

RamaKrishna
RamaKrishna

హైదరాబాద్‌: సీపీఐ నేత రామకృష్ణ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు బహిరంగ లేఖ రాశారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీలకు మద్దతిచ్చిన జేడీయూ అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు అభినందనలు తెలిపారు. ఇదే సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి తల వంచుతూ సీఏఏ, ఎన్నార్సీకి వైఎస్‌ఆర్‌సిపి మద్దతు తెలిపిందని వైఎస్‌ఆర్‌సిపి కి మీరు సలహాదారుగా వ్యవహరించాలని…ఈ నేపథ్యంలో, వీటికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసేలా జగన్ కు సూచించాలని ప్రశాంత్ కిశోర్ ను కోరుతున్నామని అన్నారు. కాగా ప్రశాంత్ కిశోర్ ను జేడీయూ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/