మహాత్మగాంధీకి నివాళులర్పించిన గవర్నర్‌

 Governor tamilisai soundararajan  Pay Tribute To Mahatma Gandhi At Bapu Ghat
Governor tamilisai soundararajan Pay Tribute To Mahatma Gandhi At Bapu Ghat

హైదరాబాద్‌: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ బాపూఘాట్‌లో ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా గవర్నర్‌తో పాటు శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తాసుఖేందర్‌రెడ్డి, హోంమంత్రి మహమూద్‌అలీ, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులు కూడా బాపూజీకి ఘనంగా నివాళర్పించారు. ప్రభుత్వ సంగీత, నృత్యకళాశాల బృందం బాపూజీకి ప్రియమైన భజన గీతాలను ఆలపించారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌, సిక్కు,బౌద్ధ మతాలకు సంబంధించిన పవిత్ర గ్రంఽధాల నుంచి మతపెద్దలు పఠించిన ప్రవచనాలను ప్రముకులు ఆలకించారు. ఉదయం 11గంటలకు సైరన్‌ మోగగానే బాపూఘాట్‌ ఆవరణలో గల గాంధీజీ విగ్రహానికి పూలు సమర్పించి రెండు నిమిషాల మౌనం పాటించి అమర వీరులను స్మరించుకున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ బాపూఘాట్‌ను సందర్శించి జాతిపితకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, జేఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అధర్‌సిన్హా, పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌, హైదరాబాద్‌ ఇన్‌చార్జి కలెక్టర్‌ రవి, ఆర్డీవో శ్రీనుతో పాటుఆయా శాఖల నుంచి ఉన్నతాధికారులుపాల్గొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చయండి:https://www.vaartha.com/andhra-pradesh/