భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

340 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

Stock markets huge losses
Stock markets huge losses

Mumbai: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలతో ముగిసాయి. ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు… చివరి వరకు నష్టాల్లోనే కొనసాగాయి. ముఖ్యంగా ఫైనాన్స్, మెటల్ సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 340 పాయింట్లు కోల్పోయి 49,161కి పడిపోయింది. నిఫ్టీ 91 పాయింట్లు పతనమై 14,850కి దిగజారింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/