అమెరికాలో 2.5 లక్షలు దాటిన కొవిడ్‌ మరణాలు

died corona patient
died corona patient

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. బుధవారం వరకు అమెరికాలో 2,50,029 మంది కరోనా బారిన పడి మృత్యువాతపడ్డారు. మరోపక్క అమెరికాలో ఇప్పటివరకు మొత్తం 1,15,17,455 కరోనా కేసులు నమోదయ్యాయి. నిత్యం లక్షా 50 వేలకు పైగా కేసులు, వెయ్యికి పైగా మరణాలు నమోదవుతున్నాయి. చలికాలం కావడంతో మహమ్మారి మరింత వ్యాప్తి చెందుతూ పోతోంది. కరోనా వ్యాప్తి చెందుతుండటంతో న్యూయార్క్ సిటీలో స్కూళ్లను మళ్లీ మూసివేశారు. బార్లు, రెస్టారెంట్లపై మరోమారు ఆంక్షలు విధించారు. మరోపక్క కరోనా ఈ విధంగా వ్యాప్తి చెందుతున్నా చాలా రాష్ట్రాల్లో ప్రజలు కనీసం ఫేస్‌మాస్క్ కూడా ధరించడం లేదు. ప్రజలందరూ ఫేస్‌మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు జో బైడెన్ ప్రజలకు సూచిస్తూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదైన విషయం విధితమే. అమెరికా తరువాత అత్యధిక మరణాలు బ్రెజిల్(1,66,699), భారత్ (1,30,993), మెక్సికో(99,026) దేశాల్లో నమోదయ్యాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/