ఉక్రెయిన్ కు మ‌రోసారి అమెరికా సాయం

US aid to Ukraine once again

వాషింగ్టన్ : ఉక్రెయిన్ పై ర‌ష్యా యుద్ధం కొన‌సాగుతోంది. రష్యా భీకర దాడులతో విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న ఉక్రెయిన్​కు అమెరికా మ‌రోసారి సాయం అందించనుంది. ఇందుకోసం రూపొందించిన 13.6 బిలియన్​ డాలర్లు కేటాయించేందుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. రిపబ్లికన్లు కూడా ఇందుకు మద్దతు తెలిపారు. 13.6 బిలియన్ల ద్వారా ఉక్రెయిన్​కు ఆయుధ, మానవతా, ఆర్థిక సహకారం అందించనుంది అమెరికా. తన బలగాలను ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు తరిలించేందుకు ఈ నిధులను ఉపయోగించనుంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత మొదట 600 డాలర్లు అమెరికా ఉక్రెయిన్ కు సాయం చేసిన విషయం తెలిసిందే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/