సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన వాయిదా

TS CM Kcr- cabinet meeting on 30th
TS CM Kcr

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన వాయిదా పడింది. వాస్తవానికి ఇవాళ యాదాద్రిలో పర్యటిస్తారని సీఎంవో ముందుగా ప్రకటించింది. కానీ, ఈ పర్యటన షెడ్యూల్‌ను తాజాగా రద్దు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో ముఖ్యమంత్రి బీజీ షెడ్యూల్ కారణంగా వాయిదా వేస్తున్నట్లు సీఎంవో వెల్లడించింది.

కాగా, షెడ్యూల్ ప్రకారం సీఎం కేసీఆర్ ఇవాళ యాదాద్రికి చేరుకుని శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణంలో పాల్గొనాల్సింది. స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని సీఎంవో వర్గాలు తెలిపాయి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సీఎం యాదాద్రి పర్యటనను రద్దు చేసుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. సీఎం పర్యటన రద్దు అయిన నేపథ్యంలో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణానికి ప్రభుత్వం తరుపున దేవాదాయ శాఖా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/