మాలీ దేశాధ్యక్షుడి రాజీనామా

Mali’s president announces resignation after rebel troops launch

బొమాకో: మాలీ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం బౌబాకర్‌ కీతా బుధవారం తెల్లవారుజామున తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో గ‌తకొత‌కాలంగా సైనికుల తిరుగుబాటు, ఆందోళనలు కొన‌సాగుతున్నాయి. దీంతో మాలిలో రక్తం పారవద్దని తాను అధ్య‌క్ష‌పదవికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త‌న రాజీనామా వెంట‌నే అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని ప్రకటించారు. దేశంలో తిరుగుబాటు చేసిన సైనికులు అధ్యక్షుడు ఇబ్ర‌హీంను అదుపులోకి తీసుకున్నారు. అంత‌కుముందు విజ‌య సూచ‌కంగా అతని ఇంటి బయట గాలిలోకి కాల్పులు జరిపారు. రాజ‌ధాని న‌గ‌రం బొమాకోను త‌మ ఆధీనంలోకి తీస‌కున్నారు. అధ్య‌క్షుడితోపాటు ప్ర‌ధాని బౌబౌ సిస్సేను మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం నిర్బంధించారు. తిరుగుబాటు సైనికుల‌తోపాటు, ప్ర‌జ‌లు కూడా భారీగా ‌రోడ్ల‌పైకి వ‌చ్చారు. కాగా ఆయన పదవికాలం ఇంకా మూడేండ్ల‌పాటు ఉన్న‌ది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/