రామ్ మూవీ లో ఐటెం సాంగ్ కు ఊర్వశి రౌతేల భారీ డిమాండ్

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేల..ప్రస్తుతం ఐటెం సాంగ్స్ కు బెస్ట్ ఛాయస్ గా మారింది. ముఖ్యంగా తెలుగు లో అగ్ర హీరోల దగ్గరి నుండి చిన్న హీరోల వరకు అంత కూడా ఈమెనే కావాలని కోరుకుంటున్నారు. రీసెంట్ గా ఏజెంట్ మూవీ లో ఐటెం సాంగ్ లో చిందులేసిన ఈ చిన్నది..ఇప్పుడు రామ్ మూవీ లో ఐటెం సాంగ్ చేయబోతుంది. ఇందుకోసం భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం రామ్ ..బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ధమాకా ఫేమ్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా ..స్పెషల్ సాంగ్ కోసం ఊర్వశి రౌతేల ను సంప్రదించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసం ఈమెకు రూ .3 కోట్ల రూపాయల కూడా ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా పాన్ ఇండియా గా రిలీజ్ కాబోతుంది.